Logo

ఆదికాండము అధ్యాయము 8 వచనము 2

ఆదికాండము 7:11 నోవహు వయసు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపుతూములు విప్పబడెను.

సామెతలు 8:28 ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు

యోనా 2:3 నీవు నన్ను అగాధమైన సముద్రగర్భములో పడవేసియున్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి, నీ తరంగములును నీ కరుళ్లును నన్ను కప్పియున్నవి.

యోబు 37:11 మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.

యోబు 37:12 ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును

యోబు 37:13 శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.

యోబు 38:37 జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?

మత్తయి 8:9 నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.

మత్తయి 8:26 అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను.

మత్తయి 8:27 ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.

యోబు 12:15 ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచివేయును.

కీర్తనలు 29:10 యెహోవా ప్రళయ జలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.