Logo

ఆదికాండము అధ్యాయము 9 వచనము 29

ఆదికాండము 5:5 ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:20 యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువది రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:27 మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:32 నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

ఆదికాండము 11:11 షేము అర్పక్షదును కనిన తరువాత ఐదువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:12 అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.

ఆదికాండము 11:13 అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగువందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:14 షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.

ఆదికాండము 11:15 షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగువందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:16 ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.

ఆదికాండము 11:17 ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:18 పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.

ఆదికాండము 11:19 పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:20 రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.

ఆదికాండము 11:21 రయూ సెరూగును కనిన తరువాత రెండువందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:22 సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.

ఆదికాండము 11:23 సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:24 నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.

ఆదికాండము 11:25 నాహోరు తెరహును కనిన తరువాత నూటపందొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

కీర్తనలు 90:10 మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.

2సమూయేలు 19:32 బర్జిల్లయి యెనుబది సంవత్సరముల వయస్సుకలిగి బహు ముసలివాడై యుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను.

1దినవృత్తాంతములు 1:4 నోవహు షేము హాము యాపెతు.