Logo

సామెతలు అధ్యాయము 22 వచనము 9

యోబు 4:8 నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు.

హోషేయ 8:7 వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.

హోషేయ 10:13 నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోత కోసియున్నారు. అబద్ధమునకు ఫలము పొందియున్నారు.

గలతీయులకు 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.

గలతీయులకు 6:8 ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును.

సామెతలు 14:3 మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.

కీర్తనలు 125:3 నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యముమీద నుండదు.

యెషయా 9:4 మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువుకాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.

యెషయా 10:5 అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.

యెషయా 14:29 ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము సర్పబీజమునుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము.

యెషయా 30:31 యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.

న్యాయాధిపతులు 15:6 ఫిలిష్తీ యులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు, తిమ్నా యుని అల్లుడైన సమ్సోను భార్యను ఆమె తండ్రి తీసికొని అతని స్నేహితుని కిచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి.

యోబు 15:31 వారు మాయను నమ్ముకొనకుందురు గాక; వారు మోసపోయినవారు మాయయే వారికి ఫలమగును.

కీర్తనలు 9:15 తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.

సామెతలు 1:31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు

సామెతలు 6:14 వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.

సామెతలు 11:18 భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.

సామెతలు 21:6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.

సామెతలు 30:8 వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.

1కొరిందీయులకు 6:9 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను