Logo

సామెతలు అధ్యాయము 22 వచనము 25

సామెతలు 21:24 అహంకారియైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును.

సామెతలు 29:22 కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.

2కొరిందీయులకు 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?

2కొరిందీయులకు 6:15 క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?

2కొరిందీయులకు 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.

2కొరిందీయులకు 6:17 కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.

1సమూయేలు 20:32 అంతట యోనాతాను అతడెందుకు మరణ శిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా

కీర్తనలు 101:4 మూర్ఖచిత్తుడు నాయొద్దనుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేననుసరింపను.

సామెతలు 14:17 త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును.

సామెతలు 14:29 దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.

సామెతలు 18:6 బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును.

సామెతలు 19:19 మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.

సామెతలు 25:28 ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.