Logo

సామెతలు అధ్యాయము 22 వచనము 29

సామెతలు 23:10 పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు

ద్వితియోపదేశాకాండము 19:14 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు.

ద్వితియోపదేశాకాండము 27:17 తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.

యోబు 24:2 సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు.

సామెతలు 24:15 భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.

హోషేయ 5:10 యుదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారివలె నున్నారు; నీళ్లు ప్రవహించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును.