Logo

మత్తయి అధ్యాయము 15 వచనము 25

మత్తయి 9:36 ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి

మత్తయి 10:5 యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని

మత్తయి 10:6 ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱలయొద్దకే వెళ్లుడి.

యెషయా 53:6 మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

యిర్మియా 50:6 నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొనిపోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి.

యిర్మియా 50:7 కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరి వారి శత్రువులు మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవామీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు.

యెహెజ్కేలు 34:5 కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.

యెహెజ్కేలు 34:6 నా గొఱ్ఱలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొఱ్ఱలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు.

యెహెజ్కేలు 34:16 తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.

యెహెజ్కేలు 34:23 వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.

లూకా 15:4 మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?

లూకా 15:5 అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి

లూకా 15:6 మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱ దొరకినదని వారితో చెప్పును గదా.

అపోస్తలులకార్యములు 3:25 ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.

అపోస్తలులకార్యములు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

అపోస్తలులకార్యములు 13:46 అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్లుచున్నాము

రోమీయులకు 15:8 నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతిగలవారికి పరిచారకుడాయెను.

సంఖ్యాకాండము 27:17 వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.

ద్వితియోపదేశాకాండము 22:1 నీ సహోదరుని యెద్దుగాని గొఱ్ఱగాని త్రోవ తప్పిపోవుట చూచినయెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరునియొద్దకు మళ్లింపవలెను.

న్యాయాధిపతులు 6:37 నేను కళ్లమున గొఱ్ఱబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱ బొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెల విచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను.

కీర్తనలు 119:176 తప్పిపోయిన గొఱ్ఱవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.

యెషయా 49:5 యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యెహెజ్కేలు 3:4 మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.

జెకర్యా 11:4 నా దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా వధకేర్పడిన గొఱ్ఱలమందను మేపుము.

మత్తయి 18:11 మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల

లూకా 17:18 ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి

లూకా 19:10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.

యోహాను 1:11 ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.