Logo

మత్తయి అధ్యాయము 15 వచనము 38

మత్తయి 15:33 ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.

మత్తయి 14:20 వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపలనిండ ఎత్తిరి

మత్తయి 14:21 స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

కీర్తనలు 107:9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు.

లూకా 1:53 ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

మత్తయి 16:9 మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను

మత్తయి 16:10 ఏడు రొట్టెలు నాలుగువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?

మార్కు 8:8 వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి.

మార్కు 8:9 భోజనము చేసినవారు ఇంచుమించు నాలుగు వేలమంది. వారిని పంపివేసిన వెంటనే

మార్కు 8:19 నేను ఆ అయిదువేల మందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారు పండ్రెండని ఆయనతో చెప్పిరి.

మార్కు 8:20 ఆ నాలుగువేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు ఏడనిరి.

మార్కు 8:21 అందుకాయన మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.

2రాజులు 4:6 పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమియు లేవని చెప్పెను. అంతలొ నూనె నిలిచిపోయెను.

2రాజులు 4:43 అయితే అతని పనివాడు నూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.

2దినవృత్తాంతములు 31:10 యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా

కీర్తనలు 78:25 దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.

మార్కు 6:42 వారందరు తిని తృప్తి పొందిన

లూకా 9:17 వారందరుతిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.

యోహాను 6:12 వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.