Logo

మత్తయి అధ్యాయము 15 వచనము 32

మత్తయి 9:33 దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి.

మార్కు 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.

మత్తయి 18:8 కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండుచేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు.

మార్కు 9:43 నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము;

లూకా 14:13 అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.

లూకా 14:21 అప్పుడా దాసుడు తిరిగివచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గృడ్డివారిని ఇక్కడికి తోడ్కొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను

మత్తయి 21:14 గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

అపోస్తలులకార్యములు 3:2 పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.

అపోస్తలులకార్యములు 3:3 పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా

అపోస్తలులకార్యములు 3:4 పేతురును యోహానును వానిని తేరిచూచి మాతట్టు చూడుమనిరి.

అపోస్తలులకార్యములు 3:5 వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.

అపోస్తలులకార్యములు 3:6 అంతట పేతురు వెండి బంగారములు నాయొద్ద లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను; నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి

అపోస్తలులకార్యములు 3:7 వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.

అపోస్తలులకార్యములు 3:8 వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.

అపోస్తలులకార్యములు 3:9 వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి

అపోస్తలులకార్యములు 3:10 శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగినదానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.

అపోస్తలులకార్యములు 3:11 వాడు పేతురును యోహానును పట్టుకొనియుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.

అపోస్తలులకార్యములు 14:8 అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.

అపోస్తలులకార్యములు 14:9 అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతనివైపు తేరిచూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి

అపోస్తలులకార్యములు 14:10 నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువసాగెను.

మత్తయి 9:8 జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.

కీర్తనలు 50:15 ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు.

కీర్తనలు 50:23 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.

మార్కు 2:12 తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచిపోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

లూకా 7:16 అందరు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించి యున్నాడనియు దేవుని మహిమపరచిరి.

లూకా 17:15 వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి

లూకా 17:16 గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగివచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు.

లూకా 17:17 అందుకు యేసు పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ?

లూకా 17:18 ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి

లూకా 18:43 వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.

యోహాను 9:24 కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవమారు పిలిపించి దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా

ఆదికాండము 32:28 అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.

ఆదికాండము 33:20 అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.

నిర్గమకాండము 24:10 ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశమండలపు తేజమువంటిదియు ఉండెను.

యెషయా 35:6 కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

మత్తయి 4:23 యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతట సంచరించెను.

మత్తయి 8:27 ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.

మత్తయి 11:5 గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.

మత్తయి 12:23 అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి.

మత్తయి 19:2 బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను.

మార్కు 1:27 అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

లూకా 5:15 అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను.

లూకా 7:22 అప్పుడాయన మీరు వెళ్లి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది

యోహాను 6:2 రోగులయెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.

అపోస్తలులకార్యములు 4:21 ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.

అపోస్తలులకార్యములు 5:16 మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.

అపోస్తలులకార్యములు 8:7 అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.