Logo

లూకా అధ్యాయము 3 వచనము 38

ఆదికాండము 5:6 షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.

ఆదికాండము 5:7 ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:8 షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:9 ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.

ఆదికాండము 5:10 కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిదివందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:11 ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయిదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:12 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.

ఆదికాండము 5:13 మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:14 కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:15 మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.

ఆదికాండము 5:16 యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిదివందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:17 మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:18 యెరెదు నూటఅరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.

ఆదికాండము 5:19 హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిదివందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:20 యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువది రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:21 హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.

ఆదికాండము 5:22 హనోకు మెతూషెలను కనిన తరువాత మూడువందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:23 హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.

ఆదికాండము 5:24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

ఆదికాండము 5:25 మెతూషెల నూటఎనుబది యేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.

ఆదికాండము 5:26 మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడువందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 5:27 మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 5:28 లెమెకు నూటఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని

1దినవృత్తాంతములు 1:1 ఆదాము షేతు ఎనోషు

1దినవృత్తాంతములు 1:2 కేయినాను మహలలేలు యెరెదు

1దినవృత్తాంతములు 1:3 హనోకు మెతూషెల లెమెకు

ఆదికాండము 5:9 ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.

ఆదికాండము 5:12 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.

ఆదికాండము 5:18 యెరెదు నూటఅరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.

ఆదికాండము 5:21 హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.

1దినవృత్తాంతములు 1:2 కేయినాను మహలలేలు యెరెదు

1దినవృత్తాంతములు 1:3 హనోకు మెతూషెల లెమెకు

ఎఫెసీయులకు 6:18 ఆత్మవలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.

హెబ్రీయులకు 11:5 విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.