Logo

లూకా అధ్యాయము 7 వచనము 33

మత్తయి 11:16 ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి

మత్తయి 11:17 మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.

మత్తయి 11:18 యోహాను తినకయు త్రాగకయు వచ్చెను. గనుక వీడు దయ్యముపట్టినవాడని వారనుచున్నారు.

మత్తయి 11:19 మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.

సామెతలు 17:16 బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేల? వానికి బుద్ధి లేదుగదా?

యెషయా 28:9 వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?

యెషయా 28:10 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.

యెషయా 28:11 నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవులచేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు.

యెషయా 28:12 అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు

యెషయా 28:13 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.

యెషయా 29:11 దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును.

యెషయా 29:12 మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును.

యిర్మియా 5:3 యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివిగాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింపజేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.

యిర్మియా 5:4 నేనిట్లనుకొంటిని వీరు ఎన్నికలేనివారై యుండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై యున్నారు.

యిర్మియా 5:5 ఘనులైనవారియొద్దకు పోయెదను వారితో మాటలాడెదను, వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరిగినవారై యుందురుగదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండ వారు కాడిని విరిచినవారుగాను కట్లను తెంపుకొనినవారుగాను ఉన్నారు.

జెకర్యా 8:5 ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడుపిల్లలతోను నిండియుండును.

ద్వితియోపదేశాకాండము 32:20 ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తము గలవారు విశ్వాసములేని పిల్లలు.

మత్తయి 9:23 అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి

లూకా 15:25 అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని

1కొరిందీయులకు 14:7 పిల్లనగ్రోవి గాని వీణ గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేదో మీటినదేదో యేలాగు తెలియును?