Logo

లూకా అధ్యాయము 15 వచనము 20

లూకా 5:8 సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్ల యెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను.

లూకా 7:6 కావున యేసు వారితో కూడ వెళ్లెను. ఆయన ఆ యింటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరాయన యొద్దకు వెళ్లి ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను.

లూకా 7:7 అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును,

ఆదికాండము 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నాచేతికఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.

యోబు 42:6 కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను.

1కొరిందీయులకు 15:9 ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడను కాను.

1తిమోతి 1:13 నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసమువలన చేసితిని గనుక కనికరింపబడితిని.

1తిమోతి 1:14 మరియు మన ప్రభువు యొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.

1తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

1తిమోతి 1:16 అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.

యెహోషువ 9:24 అందుకు వారు యెహోషువను చూచినీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితివిు.

యెహోషువ 9:25 కాబట్టి మేము నీ వశమున నున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తర మిచ్చిరి.

కీర్తనలు 84:10 నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.

మత్తయి 15:26 అందుకాయన పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా

మత్తయి 15:27 ఆమె నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినునుగదా అని చెప్పెను.

యాకోబు 4:8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీచేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.

యాకోబు 4:9 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

యాకోబు 4:10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.

1పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైనచేతిక్రింద దీనమనస్కులై యుండుడి.

లేవీయకాండము 26:40 వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు

1దినవృత్తాంతములు 21:8 దావీదు నేను ఈ కార్యముచేసి అధికపాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా

2దినవృత్తాంతములు 6:37 వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేసితివిు, దోషులమైతివిు, భక్తిహీనముగా నడచితివిు అని ఒప్పుకొని

యోబు 40:4 చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నాచేతిని ఉంచుకొందును.

విలాపవాక్యములు 1:20 యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి.

విలాపవాక్యములు 3:29 నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.

విలాపవాక్యములు 3:42 మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు.

దానియేలు 9:15 ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలమువలన నీ జనమును ఐగుప్తులోనుండి రప్పించుటవలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపముచేసి చెడునడతలు నడిచినవారము.

మీకా 7:9 నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.

మత్తయి 8:8 ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.

లూకా 15:17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను.

లూకా 15:21 అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

లూకా 23:41 మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి