Logo

లూకా అధ్యాయము 19 వచనము 32

కీర్తనలు 24:1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.

కీర్తనలు 50:10 అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా

కీర్తనలు 50:11 కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి.

కీర్తనలు 50:12 లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.

మత్తయి 21:2 మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి;

మత్తయి 21:3 ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల అవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను.

మార్కు 11:3 ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్మునడిగినయెడల అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికితోలి పంపునని చెప్పి వారిని పంపెను.

మార్కు 11:4 వారు వెళ్లగా వీధిలో ఇంటిబయట తలవాకిట కట్టబడియున్న గాడిదపిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,

మార్కు 11:5 అక్కడ నిలిచియున్నవారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిదపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.

మార్కు 11:6 అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.

అపోస్తలులకార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.

మార్కు 11:2 మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిదపిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు; దానిని విప్పి, తోలుకొని రండి.

లూకా 22:11 నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిదిగది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి.

యోహాను 4:1 యోహానుకంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పడు