Logo

లూకా అధ్యాయము 21 వచనము 30

మత్తయి 24:32 అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.

మత్తయి 24:33 ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.

మత్తయి 24:34 ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.

మార్కు 13:28 అంజూరపుచెట్టును చూచి యొక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును.

మార్కు 13:29 ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి.

మార్కు 13:30 ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

యిర్మియా 44:29 మీకు కీడు సంభవించునట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.