Logo

లూకా అధ్యాయము 23 వచనము 22

లూకా 23:23 అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.

మత్తయి 27:22 అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువ వేయుమని అందరును చెప్పిరి.

మత్తయి 27:23 అధిపతి ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

మత్తయి 27:24 పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమునుగూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను.

మత్తయి 27:25 అందుకు ప్రజలందరు వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.

మార్కు 15:13 వారు వానిని సిలువ వేయుమని మరల కేకలువేసిరి.

యోహాను 19:15 అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి

కీర్తనలు 25:19 నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.

కీర్తనలు 35:12 మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.

సామెతలు 24:2 వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును.

మార్కు 10:33 ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు.

మార్కు 15:14 అందుకు పిలాతు ఎందుకు? అతడే చెడుకార్యము చేసెనని వారినడుగగా వారు వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.

అపోస్తలులకార్యములు 13:28 ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.

అపోస్తలులకార్యములు 25:24 అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు వీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయుచు అతనిమీద నాతొ మనవి చేసికొనిరి