Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 7 వచనము 1

నిర్గమకాండము 34:29 మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసియుండలేదు.

నిర్గమకాండము 34:30 అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.

నిర్గమకాండము 34:31 మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగివచ్చిరి, మోషే వారితో మాటలాడెను.

నిర్గమకాండము 34:32 అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీపింపగా సీనాయి కొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికాజ్ఞాపించెను.

నిర్గమకాండము 34:33 మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసికొనెను.

నిర్గమకాండము 34:34 అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చువరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను

నిర్గమకాండము 34:35 మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.

ప్రసంగి 8:1 జ్ఞానులతో సములైనవారెవరు? జరుగువాటి భావమును ఎరిగినవారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చబడును.

మత్తయి 13:43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.

మత్తయి 17:2 ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.

2కొరిందీయులకు 3:7 మరణకారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి.

2కొరిందీయులకు 3:8 ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?

2కొరిందీయులకు 3:18 మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.

న్యాయాధిపతులు 13:6 ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి దైవజనుడొకడు నాయొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడనుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతోచెప్పలేదు

సామెతలు 31:26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.

దానియేలు 3:15 బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన యెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నాచేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?

మార్కు 13:11 వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు.

లూకా 9:29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.

అపోస్తలులకార్యములు 6:8 స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.

అపోస్తలులకార్యములు 23:1 పౌలు మహాసభవారిని తేరిచూచి సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని యెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.

1తిమోతి 3:13 పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసు నందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు.