Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 7 వచనము 25

అపోస్తలులకార్యములు 7:28 నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచి యున్నావా అని అతనిని త్రోసివేసెను.

యోహాను 18:10 సీమోను పేతురునొద్ద కత్తి యుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను.

యోహాను 18:11 ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.

యోహాను 18:25 సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడు నేను కాను, నేనెరుగననెను.

యోహాను 18:26 పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు

యోహాను 18:27 పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.

నిర్గమకాండము 2:12 అతడు ఇటు అటు తిరిగిచూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పిపెట్టెను.

హెబ్రీయులకు 11:25 అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,