Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 11 వచనము 12

అపోస్తలులకార్యములు 9:10 దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా, అని అతనిని పిలువగా

అపోస్తలులకార్యములు 9:11 అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు

అపోస్తలులకార్యములు 9:12 అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను.

అపోస్తలులకార్యములు 10:17 పేతురు తనకు కలిగిన దర్శనమేమైయుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి

అపోస్తలులకార్యములు 10:18 పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి

నిర్గమకాండము 4:14 ఆయన మోషేమీద కోపపడి లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;

నిర్గమకాండము 4:27 మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దుపెట్టుకొనెను.

అపోస్తలులకార్యములు 18:22 తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను.