Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 11 వచనము 26

అపోస్తలులకార్యములు 9:11 అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు

అపోస్తలులకార్యములు 9:27 అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను

అపోస్తలులకార్యములు 9:30 వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి.

అపోస్తలులకార్యములు 21:39 అందుకు పౌలు నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను.

లూకా 5:7 వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.

అపోస్తలులకార్యములు 13:1 అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి

అపోస్తలులకార్యములు 15:34 వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి.

అపోస్తలులకార్యములు 22:3 నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై యుండి

2కొరిందీయులకు 11:26 అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని

గలతీయులకు 1:21 పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని.

గలతీయులకు 2:1 అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడ యెరూషలేమునకు తిరిగి వెళ్లితిని.