Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 21 వచనము 15

ఆదికాండము 43:14 ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసినయెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను.

1సమూయేలు 3:18 సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చినవాడు యెహోవా; తన దృష్ఠికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.

2సమూయేలు 15:25 అప్పుడు రాజు సాదోకును పిలిచి దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి

2సమూయేలు 15:26 దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి

2రాజులు 20:19 అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధానము సత్యము కలిగినయెడల మేలేగదా అని యెషయాతో అనెను.

మత్తయి 6:10 నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,

మత్తయి 26:39 కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

మత్తయి 26:42 మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యము కానియెడల, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి

లూకా 11:2 అందుకాయన మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక,

లూకా 22:42 వారియొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని

ఆదికాండము 43:11 వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీరీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొనిపోవుడి.

రూతు 1:18 తనతో కూడ వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసికొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.

అపోస్తలులకార్యములు 18:20 వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా

అపోస్తలులకార్యములు 18:21 అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగివత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.

రోమీయులకు 1:10 మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.

1పేతురు 3:17 దేవుని చిత్తమాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది.