Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 21 వచనము 35

అపోస్తలులకార్యములు 19:32 ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు.

అపోస్తలులకార్యములు 22:30 మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభ వారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసికొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.

అపోస్తలులకార్యములు 25:26 ఇతనిగూర్చి మన యేలినవారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించియున్నాను.

అపోస్తలులకార్యములు 21:37 వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పై యధికారిని చూచి నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు గ్రీకు భాష నీకు తెలియునా?

అపోస్తలులకార్యములు 22:24 వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.

అపోస్తలులకార్యములు 23:10 ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్యమియ్యవలసి యున్నదని చెప్పెను.

అపోస్తలులకార్యములు 23:16 అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచిఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.