Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 27 వచనము 15

నిర్గమకాండము 14:21 మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

నిర్గమకాండము 14:22 నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

నిర్గమకాండము 14:23 ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.

నిర్గమకాండము 14:24 అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి

నిర్గమకాండము 14:25 వారి రథ చక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.

నిర్గమకాండము 14:26 అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగివచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.

నిర్గమకాండము 14:27 మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.

యోనా 1:3 అయితే యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.

యోనా 1:4 అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను.

యోనా 1:5 కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢనిద్ర పోయియుండెను

కీర్తనలు 107:25 ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను

కీర్తనలు 107:26 వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచునుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.

కీర్తనలు 107:27 మత్తులైన వారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.

యెహెజ్కేలు 27:26 నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.

మత్తయి 8:24 అంతట సముద్రముమీద తుపాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా

మార్కు 4:37 అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను.

లూకా 8:23 వారు వెళ్లుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి

యాకోబు 3:4 ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.