Logo

అపోస్తలులకార్యములు అధ్యాయము 27 వచనము 35

మత్తయి 15:32 అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిననేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా

మార్కు 8:2 జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను;

మార్కు 8:3 నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరమునుండి వచ్చియున్నారని వారితో చెప్పెను.

ఫిలిప్పీయులకు 2:5 క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.

1తిమోతి 5:23 ఇకమీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము.

1రాజులు 1:52 సొలొమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనినయెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదు గాని అతనియందు దౌష్ట్యము కనబడినయెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి

మత్తయి 10:30 మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి

లూకా 12:7 మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?

లూకా 21:18 గాని మీ తలవెండ్రుకలలో ఒకటైనను నశింపదు.

1సమూయేలు 14:45 అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికిని కూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.

2సమూయేలు 14:11 అప్పుడు ఆమె రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజు యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.

1రాజులు 18:41 పిమ్మట ఏలీయా విస్తార మైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా

దానియేలు 3:27 అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.

అపోస్తలులకార్యములు 27:10 అప్పుడు పౌలు అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకుకూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను

అపోస్తలులకార్యములు 27:22 ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు.