Logo

రోమీయులకు అధ్యాయము 3 వచనము 12

రోమీయులకు 1:22 వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

రోమీయులకు 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టమనస్సుకు వారినప్పగించెను.

కీర్తనలు 14:2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను

కీర్తనలు 14:3 వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయు వారెవరును లేరు, ఒక్కడైనను లేడు

కీర్తనలు 14:4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారికందరికిని తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు.

కీర్తనలు 53:2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

కీర్తనలు 53:4 దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?

కీర్తనలు 94:8 జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?

సామెతలు 1:7 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

సామెతలు 1:22 ఎట్లనగా, జ్ఞానము లేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించుకొందురు?

సామెతలు 1:29 జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయెను.

సామెతలు 1:30 నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.

యెషయా 27:11 దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.

యిర్మియా 4:22 నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియునుగాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.

హోషేయ 4:6 నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.

మత్తయి 13:13 ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను.ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి

మత్తయి 13:14 మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు

మత్తయి 13:19 ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.

తీతుకు 3:3 ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వము నందును అసూయ యందును కాలము గడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని

1యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.

రోమీయులకు 8:7 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.

యోబు 21:15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు

యోబు 21:16 వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.

యెషయా 9:13 అయినను జనులు తమ్ము కొట్టినవానితట్టు తిరుగుట లేదు సైన్యములకధిపతియగు యెహోవాను వెదకరు.

యెషయా 31:1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.

యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.

యెషయా 65:1 నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.

హోషేయ 7:10 ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు.

యోబు 24:13 వెలుగుమీద తిరుగబడువారు కలరు వీరు దాని మార్గములను గురుతుపట్టరు దాని త్రోవలలో నిలువరు.

కీర్తనలు 119:155 భక్తిహీనులు నీ కట్టడలను వెదకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.

దానియేలు 3:3 ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధిపతులును సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యెదుట నిలుచుండిరి.

హోషేయ 4:14 జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులనర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటనుబట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటనుబట్టి నేను వారిని శిక్షింపను; వివేచనలేని జనము నిర్మూలమగును.

జెఫన్యా 1:6 యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయనయొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను.

మత్తయి 7:7 అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.

యోహాను 8:43 మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననేగదా?

యోహాను 17:25 నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు.

రోమీయులకు 1:31 మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.