Logo

రోమీయులకు అధ్యాయము 3 వచనము 24

రోమీయులకు 3:9 ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.

రోమీయులకు 3:19 ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పుచున్నదని యెరుగుదుము.

రోమీయులకు 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టమనస్సుకు వారినప్పగించెను.

రోమీయులకు 1:29 అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై

రోమీయులకు 1:30 కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును

రోమీయులకు 1:31 మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.

రోమీయులకు 1:32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.

రోమీయులకు 2:1 కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?

రోమీయులకు 2:2 అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.

రోమీయులకు 2:3 అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా?

రోమీయులకు 2:4 లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?

రోమీయులకు 2:5 నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.

రోమీయులకు 2:6 ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

రోమీయులకు 2:7 సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

రోమీయులకు 2:8 అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.

రోమీయులకు 2:9 దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడ, శ్రమయు వేదనయు కలుగును.

రోమీయులకు 2:10 సత్‌ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.

రోమీయులకు 2:11 దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;

రోమీయులకు 2:12 ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.

రోమీయులకు 2:13 ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.

రోమీయులకు 2:14 ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.

రోమీయులకు 2:15 అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు

రోమీయులకు 2:16 దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

రోమీయులకు 11:32 అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.

ప్రసంగి 7:20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.

గలతీయులకు 3:22 యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను.

1యోహాను 1:8 మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.

1యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

1యోహాను 1:10 మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.

హెబ్రీయులకు 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.

రోమీయులకు 5:2 మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.

1దెస్సలోనీకయులకు 2:12 తండ్రి తన బిడ్డలయెడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.

2దెస్సలోనీకయులకు 2:14 మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్తవలన మిమ్మును పిలిచెను.

1పేతురు 4:13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.

1పేతురు 5:1 తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.

1పేతురు 5:10 తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.

ఆదికాండము 8:21 అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇకమీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను

లేవీయకాండము 12:7 అతడు యెహోవా సన్నిధిని దానినర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడుపిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి.

కీర్తనలు 14:3 వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయు వారెవరును లేరు, ఒక్కడైనను లేడు

యెషయా 2:9 అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకుము.

దానియేలు 9:20 నేను ఇంక పలుకుచు ప్రార్థన చేయుచు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని.

మత్తయి 3:14 అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని

లూకా 7:41 అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి.

అపోస్తలులకార్యములు 17:30 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

రోమీయులకు 2:13 ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.

రోమీయులకు 3:10 ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

రోమీయులకు 3:25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని

రోమీయులకు 5:12 ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.

ఎఫెసీయులకు 2:3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

ఎఫెసీయులకు 2:13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.

2తిమోతి 1:18 మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.