Logo

1కొరిందీయులకు అధ్యాయము 14 వచనము 30

1కొరిందీయులకు 14:39 కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,

1కొరిందీయులకు 12:10 మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.

1దెస్సలోనీకయులకు 5:19 ఆత్మను ఆర్పకుడి.

1దెస్సలోనీకయులకు 5:20 ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.

1దెస్సలోనీకయులకు 5:21 సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.

1యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లి యున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

1యోహాను 4:2 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది;

1యోహాను 4:3 యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.

అపోస్తలులకార్యములు 2:4 అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

అపోస్తలులకార్యములు 15:32 మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరులనాదరించి స్థిరపరచిరి.

రోమీయులకు 12:6 మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక,

1కొరిందీయులకు 14:32 మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.

1దెస్సలోనీకయులకు 5:11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.

1దెస్సలోనీకయులకు 5:20 ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.