Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 27 వచనము 8

ద్వితియోపదేశాకాండము 27:3 నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.

హబక్కూకు 2:2 యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.

యోహాను 16:25 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది.

2కొరిందీయులకు 3:12 తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖముమీద ముసుకు వేసికొనెను.

ద్వితియోపదేశాకాండము 4:44 మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది.

యెహోషువ 8:32 మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.

యోబు 19:24 అవి యినుప పోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.