Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 27 వచనము 18

లేవీయకాండము 19:14 చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డము వేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.

యోబు 29:15 గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని.

సామెతలు 28:10 యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొందురు.

యెషయా 56:10 వారి కాపరులు గ్రుడ్డివారు వారందరు తెలివిలేనివారు వారందరు మూగకుక్కలు మొరుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు.

మత్తయి 15:14 వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.

ప్రకటన 2:14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలి యిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు

ఆదికాండము 27:12 ఒకవేళ నాతండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను.