Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 27 వచనము 22

లేవీయకాండము 18:9 నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్క యైనను నీ తల్లి కుమార్తెయొక్క యైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.

లేవీయకాండము 20:17 ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచినయెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను; తన దోషశిక్షను తాను భరించును.

2సమూయేలు 13:1 తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను నొక సుందరవతియగు సహోదరి యుండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను.

2సమూయేలు 13:8 కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.

2సమూయేలు 13:9 అతడు పండుకొనియుండగా ఆమె పిండితీసికొని కలిపి అతని యెదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరు నాయొద్ద నుండి అవతలకు పొండనెను.

2సమూయేలు 13:10 వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోను నీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గది లోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను.

2సమూయేలు 13:11 అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా

2సమూయేలు 13:12 ఆమె నా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచుకొందును?

2సమూయేలు 13:13 నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము;

2సమూయేలు 13:14 అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.

యెహెజ్కేలు 22:11 ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు.