Logo

ప్రకటన అధ్యాయము 3 వచనము 18

ప్రకటన 2:9 నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము

సామెతలు 13:7 ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనము గలవారు కలరు.

హోషేయ 12:8 నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనినిబట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.

జెకర్యా 11:5 వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని యనుకొందురు; వాటిని అమ్మినవారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు; వాటిని కాయువారు వాటియెడల కనికరము చూపరు.

లూకా 1:53 ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

లూకా 6:24 అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొందియున్నారు.

లూకా 18:11 పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలె నైనను, ఈ సుంకరివలె నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

లూకా 18:12 వారమునకు రెండుమారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.

రోమీయులకు 11:20 మంచిది; వారు అవిశ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;

రోమీయులకు 11:25 సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.

రోమీయులకు 12:3 తన్నుతాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.

1కొరిందీయులకు 4:8 ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతోకూడ రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?

1కొరిందీయులకు 4:9 మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము.

1కొరిందీయులకు 4:10 మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.

ద్వితియోపదేశాకాండము 8:12 మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా,

ద్వితియోపదేశాకాండము 8:13 నీ పశువులు నీ గొఱ్ఱమేకలును వృద్ధియై నీకు వెండిబంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్థిల్లినప్పుడు

ద్వితియోపదేశాకాండము 8:14 నీ మనస్సు మదించి, దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో.

సామెతలు 30:9 ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.

యిర్మియా 2:31 ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి నేను ఇశ్రాయేలునకు అరణ్యమువలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పుచున్నారు?

మత్తయి 9:12 ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా.

రోమీయులకు 2:17 నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా?

రోమీయులకు 2:18 ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా?

రోమీయులకు 2:19 జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,

రోమీయులకు 2:20 చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?

రోమీయులకు 2:21 ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?

రోమీయులకు 2:22 వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?

రోమీయులకు 2:23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపరచెదవా?

మత్తయి 5:3 ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.

రోమీయులకు 7:24 అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?

యెషయా 42:19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?

యోహాను 9:40 ఆయనయొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.

యోహాను 9:41 అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.

2పేతురు 1:9 ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును.

ప్రకటన 16:15 హెబ్రీ భాషలో హార్‌ మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.

ఆదికాండము 3:7 అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.

ఆదికాండము 3:10 అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.

ఆదికాండము 3:11 అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.

నిర్గమకాండము 32:35 అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను.

నిర్గమకాండము 32:25 ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టియుండెను.

2దినవృత్తాంతములు 28:19 ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసినదానినిబట్టి యూదావారిని హీనపరచెను.

కీర్తనలు 72:12 దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.

సామెతలు 8:5 జ్ఞానము లేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనుడి బుద్ధిహీనులారా, బుద్ధి యెట్టిదైనది యోచించి చూడుడి.

సామెతలు 9:4 జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేనివారితో అది ఇట్లనుచున్నది

సామెతలు 26:12 తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.

యెషయా 42:18 చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలోచించుడి.

యెషయా 46:12 కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి

యెషయా 59:6 వారి పట్టుబట్ట నేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే.

యెషయా 64:6 మేమందరము అపవిత్రులవంటి వారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతివిు గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

యిర్మియా 2:23 నేను అపవిత్రత నొందినదానను కాను, బయలు దేవతల ననుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసినదాని తెలిసికొనుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు,

యెహెజ్కేలు 16:7 మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణభూషితురాలవైతివి; దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనము లేర్పడెను, తలవెండ్రుకలు పెరిగెను.

జెఫన్యా 1:17 జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును.

మత్తయి 6:23 నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండినయెడల ఆ చీకటి యెంతో గొప్పది.

మత్తయి 7:7 అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.

మత్తయి 25:9 అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.

మార్కు 10:24 ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;

లూకా 6:25 అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్న వారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి యేడ్తురు.

లూకా 6:42 నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

లూకా 11:35 కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియై యుండకుండ చూచుకొనుము.

లూకా 15:29 అందుకతడు తన తండ్రితో ఇదిగో యిన్ని యేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు

యోహాను 4:10 అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను

అపోస్తలులకార్యములు 2:40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను.

అపోస్తలులకార్యములు 8:22 కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారుమనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును;

రోమీయులకు 2:19 జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,

రోమీయులకు 10:3 ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.

1కొరిందీయులకు 10:12 తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

2కొరిందీయులకు 8:7 మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తయందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.

2కొరిందీయులకు 11:19 మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.

1తిమోతి 6:4 వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములనుగూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,

1యోహాను 1:6 ఆయనతో కూడ సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.

1యోహాను 2:11 తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.