Logo

ప్రకటన అధ్యాయము 6 వచనము 2

ప్రకటన 5:5 ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.

ప్రకటన 5:6 మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.

ప్రకటన 5:7 ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై యుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.

ప్రకటన 4:5 ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.

ప్రకటన 10:3 సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.

ప్రకటన 10:4 ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.

ప్రకటన 11:19 మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.

ప్రకటన 6:3 ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని

ప్రకటన 6:5 ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.

ప్రకటన 6:7 ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.

ప్రకటన 4:6 మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను.

ప్రకటన 4:7 మొదటి జీవి సింహము వంటిది; రెండవ జీవి దూడ వంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖమువంటి ముఖము గలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజు వంటిది.

అపోస్తలులకార్యములు 4:20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;

యెషయా 29:11 దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును.

యెషయా 48:6 నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను

ఆమోసు 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.

యోహాను 1:29 మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.

యోహాను 12:29 కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.

యోహాను 16:13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును

ప్రకటన 5:1 మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడై యుండువాని కుడిచేత చూచితిని.

ప్రకటన 8:1 ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.

ప్రకటన 10:2 ఆయనచేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,

ప్రకటన 19:6 అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు