Logo

ప్రకటన అధ్యాయము 12 వచనము 15

నిర్గమకాండము 19:4 నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నాయొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి.

ద్వితియోపదేశాకాండము 32:11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కలమీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను.

ద్వితియోపదేశాకాండము 32:12 యెహోవా మాత్రము వాని నడిపించెను అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతోకూడ ఉండలేదు.

కీర్తనలు 55:6 ఆహా గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే

యెషయా 40:31 యెహోవాకొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

ప్రకటన 12:6 ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.

ప్రకటన 17:3 అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని

ప్రకటన 11:2 ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.

ప్రకటన 11:3 నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.

దానియేలు 7:25 ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

దానియేలు 12:7 నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను.

1రాజులు 17:3 నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;

సామెతలు 22:12 యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును.

పరమగీతము 3:6 ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?

యిర్మియా 48:9 మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడును లేకుండ దాని పట్టణములు పాడగును.

యెహెజ్కేలు 4:6 ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సరమొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను.

యెహెజ్కేలు 20:35 జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను; ఇదే యెహోవా వాక్కు.

దానియేలు 4:16 ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువుమనస్సు వానికి కలుగును.

దానియేలు 8:14 అందుకతడు రెండువేల మూడువందల దినముల మట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును.

దానియేలు 11:36 ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణయించినది జరుగును.

హోషేయ 2:14 పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును;

మీకా 4:10 సీయోను కుమారీ, ప్రమాతి స్త్రీవలెనే నీవు వేదనపడి ప్రసవించుము, నీవు పట్టణము విడిచి బయట వాసముచేతువు, బబులోను పురమువరకు నీవు వెళ్లుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువులచేతిలోనుండి నిన్ను విమోచించును.

మత్తయి 2:13 వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.

ప్రకటన 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.

ప్రకటన 13:5 డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను