లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 9: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు, అనగా గుడారపు మందిరముయొక్క గుమ్మములకు వంతులచొప్పున కావలికాయు పని గలిగియుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 23:32

యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను

2దినవృత్తాంతములు 23:19

యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటుతగిలినవారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారములయొద్ద ద్వారపాలకులను ఉంచెను.

నెహెమ్యా 12:45

మరియు గాయకులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి.

యెహెజ్కేలు 44:10

మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా, వారితోకూడ నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు.

యెహెజ్కేలు 44:11

అయినను వారు నా పరిశుద్ధస్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు.

యెహెజ్కేలు 44:14

అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటిని విచారించుచు దానిని కాపాడువారినిగా నేను వారిని నియమించుచున్నాను.

సంఖ్యాకాండము 18:5

అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడవలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.

కీర్తనలు 134:1

యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.

యెహెజ్కేలు 40:45

అప్పుడతడు నాతో ఇట్లనెను దక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలివారగు యాజకులది.