1రాజులు 1: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" నా యేలినవాడవును రాజవునగు నీ తరువాత నీ సింహాసనముమీద ఎవడు ఆసీనుడైయుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా యేలినవాడవును రాజవునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా? అని యడిగెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నా యేలినవాడవైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనముమీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా?
పిమ్మట ఆమె కొండమీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగుచేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను.
దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజవునగు నీకు తెలియకయే యున్నది.