1రాజులు 1: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు"
సంబంధిత రిఫరెన్స్‌లు
నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనముమీద నన్ను ఆసీనునిగా చేసి, తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు, అదోనీయా యీ దినమున మరణమవునని చెప్పి
అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.
నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆ యా జనములచేతను రాజ్యములచేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.
అతడువారు నా తల్లి కుమారులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చినయెడల
నా కుమారుడైన యోనాతానువలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడును లేకపోయెను.
అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికిని కూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణము చేసెను.
నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును బాణములు నీకు ఈ తట్టున నున్నవి, పట్టుకొనిరమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును.
దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించు కొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.
తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడ పోయెను.
ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియు తీసికొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పక పోయెను.
అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన యీ నయమాను తీసికొనివచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొనిపోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందుననుకొని
అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించును గాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను
దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను
నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.
ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.
చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు
యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.
కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
మన శత్రువులచేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును.
నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును.
యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.