2దినవృత్తాంతములు 13: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగా యరొబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి."
సంబంధిత రిఫరెన్స్‌లు
తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
బేతరాబా సెమ రాయిము బేతేలు ఆవీము పారా ఒఫ్రా
ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును,
అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెనుషెకెము యజమానులారా, మీరు నా మాట వినినయెడల దేవుడు మీ మాట వినును.
సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.
ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి సీయోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.