2దినవృత్తాంతములు 20: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొనిపోగలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడు దినములు పట్టెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.
యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.
మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.
వారు మనము చేయునది మంచిపని కాదు, నేటిదినము శుభ వర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చట నుండినయెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని
వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతివిు. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుఱ్ఱములును కట్టబడిన గాడిదలును ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా
వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా
రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక వారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.
అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేసెను ఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహుమంది మనుష్యులు లయమైపోయిరి గదా ఇక అయిదుగురు లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైనయెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలొ అయిదుగురిని తీసికొనిపోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.
వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగా సిరియనుల సైన్యము వెనుకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.
కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొందరగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా
జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.
సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండినగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.
మోషే వారితో మీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చితిరా?
మరియు గిద్యోనుమీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.
అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.
మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.
పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును.
అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్లసొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.
కాగా అతడు బలమైనదానిలోనుండి తీపి వచ్చెను,తిను దానిలోనుండి తిండి వచ్చెను అనెను.మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి.
మరునాడు ఫిలిష్తీయులు హతమైనవారిని దోచుకొన వచ్చి గిల్బోవ పర్వతముమీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని
గనుక వారు అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడుసొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.
జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.
హతులైనవారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులును గిల్బోవ పర్వతమందు చచ్చి పడియుండుట చూచి
గెరారు చుట్టునున్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటిని కొల్లపెట్టి, వాటిలోనున్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి.
అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.)
నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు దోపుడుసొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.
చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడుదురు
నీ ఓడత్రాళ్లు వదలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు.
యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టునున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చబడును.