2దినవృత్తాంతములు 21: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులనేకములను యూదా దేశములో ప్రాకారముగల పట్టణములను వారికిచ్చెను; అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించినవారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆ యా ప్రదేశములలోని ఆ యా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను.
అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పుదేశమునకు వారిని పంపివేసెను.
ప్రేమింపబడున దొకతెయు ద్వేషింపబడున దొకతెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని
జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైనయెడల, తండ్రి తనకు కలిగినదానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడినదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడినదాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు.
ద్వేషింపబడినదాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే.
నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను.
తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.
జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైనయెడల, తండ్రి తనకు కలిగినదానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడినదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడినదాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము.