2దినవృత్తాంతములు 26: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియై యుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.
ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.
ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతివానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతివానిని, పాళెములోనుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.
నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను.
కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి.
అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవువరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?
అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గుపడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను.
మీరు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసినదానిని జ్ఞాపకముంచుకొనుడి.
ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;
ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి