2దినవృత్తాంతములు 6: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రియైన దావీదు మనోభిలాష గలవాడాయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా
నాతాను యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను.
యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచువరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రియైన దావీదునకు మనస్సు పుట్టగా
దావీదు తన యింటనుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా
మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా
అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెను నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి; యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితిని.
అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించినవాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను.
ఇశ్రాయేలీయులమీద నిత్యము రాజునైయుండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు.
యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగియున్నావు, ఆ తాత్పర్యము మంచిదే;
ఇప్పుడు మనమీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను.
అప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.
ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారినాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని