లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 8: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొనివచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 9:27

సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.

1రాజులు 9:28

వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.

1రాజులు 10:22

సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగియుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.

2దినవృత్తాంతములు 9:10

ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములనుకూడ కొనివచ్చిరి.

2దినవృత్తాంతములు 9:13

గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొనివచ్చు బంగారము గాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగుల యెత్తు.

ప్రసంగి 2:8

నాకొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆ యా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయకులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని.

1రాజులు 10:11

మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.