లేఖనాలను అన్వేషించండి

2రాజులు 10: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలును పిల్లలను పెంచినవారును కూడి యెహూకు వర్తమానము పంపి మేము నీ దాసులము; నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము; మేము ఎవనిని రాజుగా చేసికొనము; నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుమని తెలియజేసిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 18:14

యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి నావలన తప్పు వచ్చినది; నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరువందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను.

యెహోషువ 9:11

అప్పుడు మా పెద్దలును మా దేశనివాసు లందరును మాతోమీరు ప్రయాణ ముకొరకు ఆహారముచేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితోమేము మీ దాసులము గనుక మాతో నిబంధనచేయుడి అని చెప్పుడి అనిరి.

యెహోషువ 9:24

అందుకు వారు యెహోషువను చూచినీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితివిు.

యెహోషువ 9:25

కాబట్టి మేము నీ వశమున నున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తర మిచ్చిరి.

1రాజులు 20:4

అందుకు ఇశ్రాయేలు రాజు నా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా

1రాజులు 20:32

కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తలమీద త్రాళ్లు వేసికొని ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రదుకనిమ్మని మనవిచేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై యున్నాడా అని యడిగెను.

యిర్మియా 27:7

అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.

యిర్మియా 27:8

ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతనిచేత బొత్తిగా నాశనము చేయించువరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 27:17

వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల?

యోహాను 12:26

ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

యెహోషువ 9:8

వారుమేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువమీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చితిరి? అని వారి నడుగగా

1సమూయేలు 23:20

రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీచేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా

1దినవృత్తాంతములు 12:18

అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక,నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.

యెషయా 22:15

ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు గృహనిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము

లూకా 14:32

శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.