లేఖనాలను అన్వేషించండి

2రాజులు 10: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" దూత అతనియొద్దకు వచ్చిరాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయమువరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 11:18

కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను

2సమూయేలు 11:19

యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి?

2సమూయేలు 11:20

గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోయెనా?

2సమూయేలు 11:21

ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునక ఎత్తి గోడమీదనుండి అతనిమీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయెను గదా? ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవు తమరి సేవకుడగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను.

1రాజులు 21:14

నాబోతు రాతిదెబ్బలచేత మరణమాయెనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా

మార్కు 6:28

పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను.

ద్వితియోపదేశాకాండము 21:23

అతని శవము రాత్రివేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.

హోషేయ 1:4

యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమునుబట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసివేతును.