2రాజులు 9: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెజెబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ఆ యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు దానిని పాతిపెట్టబోయిరి; అయితే దాని కపాలమును పాదములును అరచేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.
వారు తిరిగివచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను ఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును.
మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.
అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును.
తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసి నేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారిపొమ్ము.
వారు తడవు చేయు చుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి శెయీరాకు పారి పోయెను.
అందుకు యోసేపు పుత్రులుఆ మన్యము మాకుచాలదు; అదియుగాక పల్లపుచోటున నివసించు కనానీయుల కందరికి, అనగా బేత్షెయానులోనివారికిని దాని పురముల లోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి.
వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంటవలె పడి యుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.