2రాజులు 9: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి యొకడు గుఱ్ఱమెక్కి పోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలిసికొనెను గాని తిరిగిరాక నిలిచెనని సమాచారము తెలిపెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.
అంతట యెహోరాము యెహూను చూచి యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమైయుండగా సమాధానమెక్కడనుండి వచ్చుననెను.
దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో నడచువాడెవడును శాంతినొందడు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరినిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు
శాంతిమార్గము వారెరుగరు.
అంతలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబయొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి
యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి నీ యజమానుని చంపినవాడా, జిమీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా