2రాజులు 9: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసిపోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడునాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను.
వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును.
ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడుచును.
అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారిమీదికి వచ్చును.
దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించువాడెవడును లేకపోవును
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు,
భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడవంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును.
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను.
అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను.
వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతనిముందర నిలువజాలకపోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని
యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను.
విలుకాండ్రు రాజైన యోషీయామీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి--నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడనుండి నన్ను కొనిపోవుడని చెప్పెను.
యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమునుబట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసివేతును.
పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులందరును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.