2రాజులు 9: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" అంతట యెహోరాము యెహూను చూచి యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమైయుండగా సమాధానమెక్కడనుండి వచ్చుననెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచియుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.
కాబట్టి యొకడు గుఱ్ఱమెక్కి పోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలిసికొనెను గాని తిరిగిరాక నిలిచెనని సమాచారము తెలిపెను.
వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.
దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.
ఒమీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.
నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.
మరియు అహాబు దేవతాస్తంభమొకటి1 నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.
యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను.
ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తలనందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా
యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.
అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను.
ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాసదినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టి
నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొనిపోయి రాళ్లతో చావగొట్టుడి.
తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు.
చక్కనిదానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గలదానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసినదానా,
అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి యిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు భోదించుచు వారిని మోసపరచుచున్నది
మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.
ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడ వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలుచేతును,
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేత పట్టుకొనియుండెను.
దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి యుండెను మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహా బబులోను.
ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.
దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.
సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లెహేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా
యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారినందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి1 ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను.
అందుకు ఇశ్రాయేలు రాజు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలాగనవద్దనెను.
అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి,తన తలిదండ్రులిద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను.
ఇతడు తన తలిదండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను
యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడు వానిని వాని మాటలు మీరెరిగెయున్నారని చెప్పెను.
దావీదు బయలుదేరి వారికి ఎదురుగాపోయి వారితో ఇట్లనెను మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నావలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగియుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.
ఇశ్రాయేలు రాజు యెహోవాయొద్ద విచారణ చేయుటకు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగగలిగి యున్నాననగా యెహోషాపాతు రాజు ఆలా గనవద్దనెను.
మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదావారిని విగ్రహపూజకు లోపరచెను.
ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్థులను వ్యభిచరింపజేసి, నీకంటె యోగ్యులైన నీ తండ్రి సంతతివారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు.
ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని యుండిరి.
అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.
దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.
దాని పిల్లలు జారసంతతియై యున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను.