లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 1: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు నీవెక్కడనుండి వచ్చితివని యడిగెను. అందుకు వాడు ఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 5:25

అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను.

యోబు 1:15

ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

యోబు 1:16

అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

యోబు 1:17

అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

యోబు 1:18

అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా

యోబు 1:19

గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యౌవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

యోబు 1:17

అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

యిర్మియా 48:19

ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.