లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 17: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరును నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 15:28

ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్యమందలి రేవులదగ్గర నిలిచియుందును.

2సమూయేలు 17:21

వారు వెళ్లిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలోనుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపెలు అతనిమీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా

2సమూయేలు 17:22

దావీదును అతనియొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు ఒకడును లేకపోయెను.

2సమూయేలు 15:14

దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి.

2సమూయేలు 15:28

ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్యమందలి రేవులదగ్గర నిలిచియుందును.

1సమూయేలు 20:38

వాని వెనుకనుండి కేకవేసి నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసికొనివచ్చెను గాని

కీర్తనలు 55:8

అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని.

సామెతలు 6:4

ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.

సామెతలు 6:5

వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.

మత్తయి 24:16

యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను

మత్తయి 24:17

మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకు దిగకూడదు;

మత్తయి 24:18

పొలములో ఉండువాడు, తన బట్టలు తీసికొనిపోవుటకు ఇంటికి రాకూడదు.

2సమూయేలు 20:19

నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్థులలోను యధార్థవంతులలోను చేరికయైనదానను; ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు; యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదువని చెప్పగా

2సమూయేలు 20:20

యోవాబు నిర్మూలము చేయను, లయపరచను, ఆలాగున చేయనే చేయను, సంగతి అది కానే కాదు.

కీర్తనలు 35:25

ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనక యుందురుగాక

కీర్తనలు 56:2

అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగవలెనని యున్నారు

కీర్తనలు 57:3

ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును.(సెలా.)

1కొరిందీయులకు 15:54

ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.

2కొరిందీయులకు 5:4

ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము.

2సమూయేలు 15:35

అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.

2సమూయేలు 18:20

యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.

కీర్తనలు 119:87

భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను.

కీర్తనలు 119:150

దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నాయొద్దకు సమీపించుచున్నారు