2సమూయేలు 24: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" యోవాబు జనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికియుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయును గాక; నా యేలినవాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏల పుట్టెననెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయును గాక అని అబీషైతో చెప్పి
అందుకు యోవాబు రాజా నా యేలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక; వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవిచేసెను.
అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను.
యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనతవచ్చును జనక్షయము రాజులకు వినాశకరము.
నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.
మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యిరెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక.
దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,
యెహోవా నా యేలినవాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను;
నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను.
రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములనన్నిటిని బయలుదేవత పూజకు ఉపయోగించిరి.
తాను యెహోవా సన్నిధిలోనుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసియుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.