2సమూయేలు 5: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" దావీదు యెహోవా తనకాజ్ఞాపించిన ప్రకారము చేసి, గెబనుండి గెజెరువరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతముచేసిరి.
అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు దాసులైయున్నారు.
నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.
నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును.